సరుబుజ్జిలి: పాల కేంద్రంలో నాగుపాము దర్శనం

సరుబుజ్జిలి మండలం అమృతలింగానగరం సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ పాల కేంద్రంలో మంగళవారం నాగుపాము హల్చల్ చేసింది. పాల కేంద్రంలోని ఓ గదిలోకి వచ్చిన నాగుపాము గది పైన ఉన్న చుట్టూ బల్లల పైకి చేరింది. పడగవిప్పి బుసలు కొడుతున్న పాముని చూసి అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. నాగుల చవితి రోజు నాగుపాము దర్శనమివ్వడంతో ఎంతో పవిత్రంగా భావించి మొక్కుకున్నారు. పాముని బయటకు పంపించే ప్రయత్నాలు చేశారు.

సంబంధిత పోస్ట్