బురిడి కంచరాంలో సజావుగా సాగిన ఎస్ఎంసి ఎన్నికలు

పొందూరు మండలం బురిడి కంచరాం గ్రామంలో గల ప్రాథమికొన్నత పాఠశాలలో ఎస్ ఎమ్ సి ఎన్నికలు సజావుగా జరిగాయి. హెచ్ ఎమ్ పైడి మోహన్ మురళి అలాగే పి ఏ సి ఎస్ చైర్మన్ వండాన మురళి ఆధ్వర్యంలో జరిగిన ఎస్ ఎమ్ సి ఎన్నికలో  చైర్మన్ గా మోయ్యి జగమ్, వైస్ చైర్మన్ గా భానుమతిని ఏకగ్రీవంగా ఎన్నికోవడం జరిగింది. అలాగే మొత్తం 15 మంది సభ్యులు తో కమిటీ ని ఏర్పాటు చేసి వాళ్లతో ప్రధానోపాధ్యాయులు, పి ఏ సి ఎస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయించారు.

సంబంధిత పోస్ట్

✕
✕