రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు ను నిమ్మడ తన క్యాంపు కార్యాలయంలో శనివారం లావేరు మండలం తెదేపా అధ్యక్షుడుగా ఎన్నికైన ముప్పిడి సురేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అంతా కలిసికట్టుగా పనిచేయలన్నారు. ఈ కార్యక్రమంలో కాలింగ కార్పొరేషన్ డైరెక్టర్ భువనేశ్వర్, చౌదరి బాబ్జి చైర్మన్ చౌదరి అవినాష్ , ముప్పిడి మురళీమోహన్, తోటయ్యదొర తదితరులు పాల్గొన్నారు.