జి. సిగడాం మండలం దేవరవలస గ్రామానికి చెందిన కొడమాటి. అశోక్ మృతదేహం బుధవారం సముద్ర తీరంలో దొరికింది. అయితే గార మండలం వత్సలవలసలోని రాజులమ్మ తల్లి యాత్రలో ఆదివారం సముద్రంలో కొట్టుకుపోతున్న వారిని రక్షించాడానికి వెళ్లిన అశోక్ గల్లంతయ్యాడు. ఈ మేరకు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ మేరకు పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం కు తరలించారు.