శ్రీకాకుళం, ఎచ్చెర్ల పరిధిలోని అల్లినగరం గ్రామ పంచాయతీలో ఆదివారం 'సార్వత్రిక పల్స్ పోలియో' కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు మాడుగుల వెంకటరావు, గ్రామ సంఘ అధ్యక్షురాలు ఉరిటి సత్యవతి, సీనియర్ నాయకులు కూనపు గోపాల్, తెలుగు రైతు అధ్యక్షులు కూనపు వాసుదేవరావు, మాజీ వార్డ్ మెంబర్ గుంటుకు సంతోష్ కుమార్, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. పోలియో రహిత భావిభారత సమాజ నిర్మాణం లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది. నిండు జీవితానికి రెండు చుక్కలు ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.