శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొలువుతీరిన మహాలక్ష్మి అమ్మవారు గురువారం శాకంబరి దేవిగా దర్శనమిచ్చారు. వివిధ రకాల ఫలాలు, పుష్పాలు, కూరగాయలతో అమ్మవారిని అలంకరించారు. ఆలయ ధర్మకర్త రాంభట్ల సూర్యకాంత కామేశ్వరి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.