ఎచ్చెర్ల నియోజకవర్గం జి. సిగడాం మండలం బాతువ గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో జేసీబీ అగ్నికి ఆహుతి అయిన ఘటన జరిగింది. శుక్రవారం స్థానిక గ్రామంలో పంట పొలంలో మట్టి తరలించించేదుకు పనులు చేపడుతుండగా ఆకస్మాతుగా మంటలు చెలరేగాయని యజమాని ఢిల్లేశ్వరావు తెలిపారు. వాహనంలోని వైర్లు షార్ట్ సర్క్యూట్‌తో ఇలా జరిగిందని చెప్పాడు. రూ. 50 లక్షలు నష్టం వాటిల్లిందని వాపోయాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.