లావేరు మండలం తాళ్ళవలస పంచాయతీ రావివలస గ్రామంలో గురువారం ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. సీనియర్ టీడీపీ నాయకులు, లావేరు మండల టీడీపీ అధ్యక్షుడు ముప్పిడి సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, వృద్ధులు, అవ్వాతాతలు, లబ్ధిదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రతి నెల 1వ తేదీనే క్రమం తప్పకుండా పెన్షన్లను ఇంటివద్దకే అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కూర్మరావు, విఆర్వో రాజేశ్వరి, సచివాలయ సిబ్బంది వినోద్ తదితరులు పాల్గొన్నారు.