రణస్థలం మండల కేంద్రం జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు శ్రీకాకుళం వైపు వస్తున్న కారు ముందు వెళ్తున్న వాహనాన్ని అధిగమించే సమయంలో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు డివైడర్ పైకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న వారికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.