శ్రీకాకుళం, ఎచ్చెర్ల వద్ద జాతీయ రహదారి ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్లు తుఫాన్ ప్రభావంతో భారీ వర్షపు నీటితో పూర్తిగా జలమయమయ్యాయి. దీనివల్ల వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి లోతు తెలియక ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, వాహనదారులు వేగాన్ని తగ్గించి అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. అధికారులు వెంటనే నీటిని తొలగించి ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా చూడాలని కోరుతున్నారు.