బారువలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నవంబర్ 1 నుండి 7 వరకు మిషన్ లైఫ్ కార్యక్రమంలో భాగంగా బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు జరుగుతున్నాయి. ప్రిన్సిపాల్ డా. డి. రామారావు అధ్యక్షతన, ఎన్.ఎస్.ఎస్ యూనిట్లు సంయుక్తంగా వీటిని నిర్వహిస్తున్నాయి. నవంబర్ 1 నుంచి 4 వరకు ఆరోగ్యకర జీవనశైలి, ఇంధన ఆదా, జల సంరక్షణ మరియు సుస్థిర ఆహార విధానాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బంది పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞలు చేశారు. రానున్న మూడు రోజులు కార్యక్రమాలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.