పాలవలసలో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

సోంపేట మండలం పాలవలస గ్రామంలో దసరా సందర్భంగా పండగ వాతావరణం నెలకొంది. ఆదివారం దసరా ఉత్సవాలు గ్రామంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామదేవత శ్రీ రౌతుపోలమ్మ తల్లిని మేళతాలాల మధ్య యువత నృత్యాలతో, హరేక్రిష్ణ హరేరామ భజనలతో గ్రామంలోకి ఆహ్వానించి అమ్మవారిని ప్రతిష్ఠించారు. మూడవరోజు మంగళవారం ఉదయం నుంచి ప్రత్యేక పూజలతో భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. అనంతరం సాయంత్రం అమ్మవారిని సాగనంపుతారని గ్రామస్తులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్