ఇచ్చాపురం: గంజాయితో ఒకరి అరెస్టు.. కోర్టుకు తరలింపు

ఇచ్చాపురంలో గంజాయితో తిరుగుతున్న ఒక వ్యక్తిని అరెస్టు చేశామని సీఐ చిన్నం నాయుడు తెలిపారు. శనివారం రాత్రి స్థానిక పోలీసు స్టేషన్లో మాట్లాడుతూ రైల్వే స్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఒకరి వద్ద 16 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించామని అన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఒడిశా నుంచి హైదారాబాద్ తరలిస్తున్నట్లు చెప్పాడు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించమన్నారు.

సంబంధిత పోస్ట్