కంచిలి: జాతీయ రహదారిపై బోల్తాబడ్డ లారీ.. డ్రైవర్ కు గాయాలు

కంచిలి మండలం బలియా పుట్టుగ వద్ద హైవేపై సోమవారం లారీ బోల్తా పడ్డ ఘటన జరిగింది. తమిళనాడు నుంచి అస్సాం వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న హైవే పోలీసులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్ని చికిత్స నిమిత్తం సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్