ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద గురువారం పోలీసులు కేజీ 10. 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని సీఐ ఎం. చిన్నం నాయుడు తెలిపారు. వారి వద్ద నుండి 2 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. తమిళనాడుకు చెందిన నరేష్ సేతి, డి గోపినాధ్ లను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.