శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం కవిటి గ్రామంలో గత రెండు మూడు రోజులుగా అర్ధరాత్రి వేళల్లో కరెంట్ కోతలు జరుగుతున్నాయి. ప్రజలు నిద్రించే సమయంలో కరెంట్ లేకపోవడంతో చిన్న పిల్లలు, వృద్ధులు, రోగులు ఉక్కపోత, దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని శనివారం ప్రజలు కోరుతున్నారు.