రణస్థలం: పురుగుల మందు తాగి మహిళ మృతి

పురుగుల మందు తాగి మహిళ మృతి చెందిన ఘటన రణస్థలం మండలం వెంకటరావుపేటలో చోటు చేసుకుంది.  కొత్తకోట సత్యం(58) అనే మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కుటుంబసభ్యులు గమనించి వెంటనే కొండములగాం సీహెచ్సీకి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్