సోంపేట మండలం బేసి రామచంద్రాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గురువారం ఒరిస్సా నుండి ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులు వెళుతుండగా అదుపుతప్పి డివైడర్ ని ఢీకొట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ వీరి పైనుండి వెళ్లిపోవడంతో ఒరిస్సా కు చెందిన రుద్ర శక్తి (23) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంకో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.