పశువులను అక్రమంగా తరలిస్తున్న వాహనం సీజ్

పశువులను అక్రమంగా తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్సై సిహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. శుక్రవారం నరసన్నపేట మండల జమ్ము జంక్షన్ వద్ద హెడ్ కానిస్టేబుల్ వాహనాలను తనిఖీ చేస్తుండగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశామన్నారు. జలుమూరు మండలం నుంచి విశాఖపట్నం ఆలమండకు సుమారు 31 పశువులు తరలిస్తుండగా వాహనంతో పాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్