శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలం, పోలాకి పంచాయతీలోని వెదుల్లవలస గ్రామంలో సర్వే నెంబర్ 59లో ఉన్న కొత్తచెరువుకు నీటిని తీసుకెళ్లే ఇరిగేషన్ కాలువ చెత్తతో పూర్తిగా మూసుకుపోయింది. దీని కారణంగా భారీ వరదలు వచ్చినప్పటికీ చెరువులోకి నీరు చేరడం లేదు. గ్రామస్తులు, రైతులు ఈ చెరువును వినియోగించుకునేలా చూడాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు. ఈ కొత్త చెరువు R&B రోడ్డుకు ఆనుకుని ఉంది.