జలుమూరు మండలం శ్రీముఖలింగం లో కొలువై ఉన్న శ్రీముఖలింగేశ్వరుని ఆలయంలో ఆరు రోజులుగా నిర్వహిస్తున్న స్వామివారి కల్యాణోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలకు సమీప వంశధార నదిలో చక్ర తీర్థ స్నానాలు నిర్వహించారు. ఆలయ ఈవో ఏడుకొండలు మాట్లాడుతూ ఆరు రోజులపాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టామని, ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని వివరించారు.