నరసన్నపేట: త్రాగునీటి పైపు లీక్.. రహదారి పైకి నీరు

నరసన్నపేట పట్టణంలో ఇటీవల త్రాగునీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యను పరిష్కరించడానికి వంశధార కాలనీ వద్ద జల్ జీవన్ మిషన్ పథకం కింద 40 లక్షల రూపాయలతో కొత్త పనులు చేపట్టారు. అయితే, పనుల సమయంలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల నీరు ప్రధాన రహదారిపై వృధాగా ప్రవహిస్తోంది. ఈ విషయంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్