రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. ఆదివారం నరసన్నపేటలో మాట్లాడుతూ గతంలో తమ ప్రభుత్వం హయాంలో వంశధార ఎడమ కాలువ ఆధునికరణ ఎనిమిది 860 కోట్లు నిధులు మంజూరు చేశామని, ప్రభుత్వం మారడంతో అవి నిలిచిపోయాయి అన్నారు. కేంద్ర రాష్ట్ర మంత్రుల సహకారంతో 1200 కోట్లతో ఆధునికరణ పనులు చేపట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు.