నరసన్నపేట మండలం కొల్లవానిపేట వద్ద ఉన్న రైల్వే గేట్ మూసి వేయడం జరుగుతుందని రైల్వే సెక్షన్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ రైల్వే పనుల మరమ్మత్తులు కోసం 17వ తేదీ శనివారం ఉదయం నుండి మరుసటి రోజు సాయంత్రం 6 గంటల వరకు మూసి వేస్తున్నామని చెప్పారు. అలాగే ఈ నెల 19, 20 తేదీలలో పూర్తిగా మూసి వేస్తున్నామని ప్రయాణికులు తమకు సహకరించాలని కోరారు.