నరసన్నపేట మండలం సత్యవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల పదో తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించిన పొట్నూరు ధనుష్ త్రిబుల్ ఐటీ లో సీట్ సాధించాడు. గురువారం స్థానిక పాఠశాలలో జరిగిన మెగా పిటిఎం సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీపీ ఆరంగి మురళీధర్ విద్యార్థికి 10 వేల రూపాయల నగదును బహుమతిగా అందజేశారు. ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన వాడు కావడంతో ఈ సహాయం చేశానన్నారు. పలువురు పాల్గొన్నారు.