నరసన్నపేట శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో అభిషేక కార్యక్రమాలు కూడా చేపట్టారు. అనంతరం శుక్రవారం సాయంత్రం స్వామివారిని శేష వాహనంపై ఉంచి తిరువీధి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించగా కార్యక్రమంలో కోలాటం బృందం నృత్యాలు స్థానికులను ఆకట్టుకున్నాయి.