నరసన్నపేట: ఓటరు జాబితాలో తప్పులు ఉంటే సరిదిద్దుతాం

నరసన్నపేట తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం రాజకీయ ప్రతినిధులతో ఈ.ఆర్.ఓ. బి. జయదేవి సమీక్ష నిర్వహించారు. ఓటరు జాబితాలో ఏవైనా లోటుపాట్లుంటే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆమె సూచించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓట్లను స్థానికంగా నమోదు చేయడంలో ఇబ్బందులున్నాయని పలువురు ప్రతినిధులు తెలిపారు. ఈ సమస్యలను తమ దృష్టికి తెస్తే సరిచేస్తామని జయదేవి హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్