సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందిస్తున్న భోజనం నాణ్యత కలిగిన ఆహారాన్ని అందించాలని నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ఆదేశించారు. గురువారం ఆయన ఆకస్మికంగా స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ముందుగా రోగులకు అందుతున్న భోజన సదుపాయాన్ని స్థానిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆయనే స్వయంగా రోగులకు భోజనం వడ్డించారు. భోజనం ఎలా ఉందని రోగులను అడిగి తెలుసుకున్నారు.