సారవకోట: మత్స్యకార గిరిజనులకు కూటమి ప్రభుత్వం అండ

మంగళవారం సారవకోట మండల కేంద్రంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పలు గిరిజన గ్రామాలకు చెందిన 8 మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికి లక్షా 14 వేల రూపాయల విలువైన మోపెడ్ వాహనాలతో పాటు ఐస్ బాక్సులను అందజేశారు. కూటమి ప్రభుత్వం మత్స్యకార గిరిజనులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ వాహనాలను 75 శాతం రాయితీతో మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్