నరసన్నపేటలో ఉదయం అంతా వేసవి వేడితో అల్లాడిపోయిన ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం లభించింది. బుధవారం మధ్యాహ్నం వరకు వేసవి తాపంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. బయటకు రాలేని పరిస్థితులు కనిపించాయి. అయితే ఒక్కసారిగా మధ్యాహ్నం మూడు గంటల నుండి వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఉరుములతో కూడిన భారీ వర్షం కురవడంతో స్థానికులు ఉపశమనం పొందారు. వేసవి ఇది ఎంతో అనుకూలమని రైతులు పేర్కొన్నారు.