నరసన్నపేట పట్టణంలోని స్థానిక తెలగ వీధిలో చోరీ జరిగిందని ఎస్ఐ సిహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. గురువారం రాత్రి స్థానిక వీధికి చెందిన శేఖర్ ఇంట్లో ఈ చోరీ జరిగినట్లు వివరించారు. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో చోరీ జరిగిందని, 1. 5 తులాల బంగారం, 16 తులాల వెండి తో పాటు పదివేల నగదు చోరీ జరిగినట్లు ఫిర్యాదు అందిందన్నారు. ఈ మేరకు శుక్రవారం క్లూస్ టీంను రప్పించి పరిశీలించామన్నారు.