చివరి భూముల వరకు నీటిని అందించే బాధ్యత నాదే: ఎమ్మెల్యే శిరీష

పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం పొల్లాడకు కాలువ ద్వారా వంశధార నుండి వస్తున్న నీటికి ఎమ్మెల్యే గౌతు శిరీష గురువారం స్వాగతం పలికి హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నమాటకు కట్టుబడి చివరి భూములకు నీరు అందించినందుకు తాను కృషి చేశానని, అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి అచ్చంనాయుడు తనకు సహాయ సహకారాలు అందించారని వారికి నియోజకవర్గము తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.

సంబంధిత పోస్ట్