శ్రీకాకుళం జిల్లా పలాసలోని శ్రీ విద్యా వాహిని డిగ్రీ కళాశాలలో ఈ నెల 6వ తేదీన ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్మాణ్ ప్రతినిధి శేషగిరిరావు మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిఐసిఐ బ్యాంక్, గ్రాన్యూల్స్ ఇండియా, అపోలో ఫార్మసీ, హెటిరో ల్యాబ్స్ వంటి ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయి. 10వ తరగతి నుండి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం 7095731303 నంబర్‌ను సంప్రదించగలరు.