మందస: స్కూల్ వ్యాన్ బోల్తా.. చిన్నారులకు గాయాలు

మందస మండలం హరిపురం గ్రామానికి చెందిన కైజాన్ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్ వ్యాన్ బోల్తా పడింది. ఈ సంఘటనలో ఇద్దరు చిన్నారులు గాయాల పాలయ్యారు. విద్యార్థి తల్లి, వ్యాన్ డ్రైవర్ స్వల్ప గాయాలపాలైన సంఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఆటోను తప్పించబోయి స్కూల్ వ్యాన్ రోడ్డు పక్కకు బోల్తా పడింది. 3వ తరగతి విద్యార్థి గేదెల ఉజ్వల్ కు 5వ తరగతి చదువుతున్న మెట్ట తనుజ్ కు రక్తపు గాయాలు అయ్యాయి.

సంబంధిత పోస్ట్