పిల్లలు పుట్టడం లేదని వివాహిత ఆత్మహత్య

మందస మండలం చీపిలో రణహతి మంజు (26) అనే వివాహిత సంతానం లేదన్న మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 2019లో సవర నీలకంఠంతో వివాహమైన మంజుకు పిల్లలు లేకపోవడంతో తరచూ బాధపడేది. సెప్టెంబరు 30న పుట్టింటికి వెళ్లి, అక్టోబరు 1న రాత్రి ఇంట్లోనే చీరతో ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕