పలాస: తల్లి మందలించిందని ఇంటర్ విద్యార్థి సూసైడ్

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి పద్మనాభపురం శివాజీ నగర్ కాలనీలో శుక్రవారం రాత్రి ఇంటర్ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు వివరించారు. పరీక్షలు సమీపిస్తున్న వేళ తల్లి మందలించడంతో మనస్థాపానికి గురై బుడుమూరు యశ్వంత్ (17) ఉరి వేసుకున్నాడు. శనివారం ఉదయం  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్