పలాస కాశీబుగ్గ రాధాకాంత చెరువులో జారిపడి వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లికి చెందిన చిగులపల్లి కోటేశ్వరరావు (45) శనివారం మృతి చెందాడు. ఆంజనేయస్వామి మాలధారణ చేసిన ఆయన సమీపంలో ఉన్న చెరువుకి స్నానానికి దిగి గల్లంతయ్యాడు. సాయంత్రం ఐదు గంటల సమయంలో మృతదేహం చెరువులో తేలియాడుతూ కనిపించింది. ఈ మేరకు పోలీసులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు.