పలాస: కుమారుడు అదృశ్యమయ్యాడు అంటూ తల్లి ఫిర్యాదు

పలాస మండలం ఈదులపల్లి గ్రామానికి చెందిన పడ్డ ప్రవీణ్ గురుదాస్ పురం సచివాలయంలో అసిస్టెంట్ ఇంజినీర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 23వ తేదీన ఇంటి నుంచి ఉద్యోగ రీత్యా సచివాలయానికి వెళ్లిన ప్రవీణ్ ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుపక్కల ప్రాంతాలు తోపాటు బంధువుల ఇళ్లలో ఎంత వెతికినా కనిపించలేదని తల్లి ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్