పలాస: భర్తకు తలకొరివి పెట్టిన భార్య

పలాసలోని జగనన్న కాలనీలో సోమవారం, అనారోగ్యంతో మరణించిన నెయ్యిల ఉమామహేశ్వరరావు (56) అంత్యక్రియలను ఆయన భార్య సరస్వతి సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. సమీప బంధువులు లేకపోవడంతో, భార్య స్వయంగా భర్తకు తలకొరివి పెట్టారు. ఈ దృశ్యం చూసిన స్థానికులు, బంధువులు భావోద్వేగానికి లోనయ్యారు.

సంబంధిత పోస్ట్