పలాస: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. ఒకరికి గాయాలు

పలాస మండలం సూదికొండ గ్రామానికి చెందిన దివ్యాంగుడు బుట్ట గంగాధర్ రావు(36), భార్య సరళ (30), సయ్యద్ ఫరీద్ (26) ముగ్గురు వ్యక్తులు స్కూటీపై మంగళవారం ఒడిశా కోయిపూర్ గ్రామం వెళ్లి తిరిగి వస్తుండగా గారబంద వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఫరీద్, గంగాధర్ రావు తీవ్ర గాయాలతో మృతి చెందగా. సరళకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గారబంద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్