పలాస తహశీల్దార్‌గా సత్యం

పలాస మండల తహశీల్దార్‌ ఎస్‌. ఎస్‌. వి. ఎస్‌. నాయుడు స్థానంలో సత్యం గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో జలుమూరు మండల తహశీల్దార్‌గా విధులు నిర్వహించేవారు. ఇక్కడ తహశీల్దార్‌గా పనిచేసిన ఎస్‌. ఎస్‌. వి. ఎస్‌ నాయుడు ఎన్నికల విధుల్లో చోటుచేసుకున్న బదిలీల్లో భాగంగా పలాస వచ్చి, తిరిగి నర్సీపట్నం వెళ్లిపోయారు. తహశీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన సత్యం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్