నివగాం కళాశాలలో ఇంటర్ టాపర్లకు విద్యాపురస్కారాల ప్రదానం

శ్రీకాకుళం, పాతపట్నం,నివగాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ టాపర్లకు రామరాజు విద్యాపురస్కారాలు, నగదు బహుమతులు బుధవారం అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ జి. పుష్పలత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ గ్రేడ్-1 ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎద్దు గోపాలదాసునాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన చంద్రిక, నీలవేణి, వాసుదేవరావు, హరీష్, స్వప్న, పావనిలకు పురస్కారాలు అందజేశారు. విశిష్ట అతిథులుగా ఎ. సాయిరాం, శ్రీ ఆదినారాయణ కూడా విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕