హిరమండలం మండలం లోని అంబావిల్లి గ్రామానికి చెందిన ఒకరు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే స్థానిక మండలం అంబావిల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ గత నెల 27వ తేదీన తన ఇంటి డాబాపై నిద్రిస్తుండగా పడి గాయాలు పాలయ్యాడు. క్షతగాత్రులను కుటుంబ సభ్యులు విశాఖ కేజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు