మెలియాపుట్టి: ఆటోలు ఢీకొన్న ప్రమాదంలో విద్యార్థులకు గాయాలు

మెలియాపుట్టి మండలంలో శుక్రవారం ఉదయం రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో కొసమాల జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు వివరాల మేరకు జగులింగుపురం గ్రామం నుంచి విద్యార్థులు ఆటోలో మెలియాపుట్టి వైపు వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న మరో ఆటో ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్