మెళియాపుట్టి మండలంలో చాపరకు చెందిన మతిస్థిమితం లేని వృద్ధుడు కిక్కర అప్పలస్వామి (70) శవమై ఉలాసపేట సమీపంలోని తోటలో కనిపించాడు. ఈనెల 8 నుంచి కనిపించకుండా పోయి శుక్రవారం ఉలాసపేట సమీపంలో శవమై ఉండగా స్థానికులు గుర్తించారు. మృతుడు గత మూడు రోజుల కిందట ఉలాసపేట తోటలో ఎండ తీవ్రతకు మృతి చెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.