పాతపట్నం మండలం తెంబూరు లింగుబంద వద్ద బుధవారం రాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డాడు. లాబరకు చెందిన ముగ్గురు యువకులు తెంబూరు నుంచి బైక్ పై స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ ప్రమాదంలో కనకాల మధు (25) ఘటనాస్థలంలో చనిపోయారు. మరో యువకుడు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డాడు. అయితే స్థానికులు 108లో పాతపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.