వసప గ్రామానికి టిడిపి యువ నాయకుల నీటి ట్యాంకర్ సాయం

కొత్తూరు మండలం వసప గ్రామంలో సాంకేతిక సమస్యలతో కుళాయిలు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గమనించి, టిడిపి యువ నాయకులు మరియు వెంకటాపురం నీటి సంఘం అధ్యక్షులు బుచ్చి సోమేశ్ బుధవారం నీటి ట్యాంకర్ ను తెప్పించి గ్రామంలో ప్రతి ఒక్కరికి త్రాగునీటిని అందించారు. దీనిపట్ల వసప గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కార్యదర్శి వలురౌతు శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయమని సోమేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕