రోడ్డు దుర్ఘటనలో 16 మంది కార్మికులకు గాయాలు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం జాతీయ రహదారిపై బుధవారం వ్యాన్ అదుపు చెప్పి బోల్తా పడిన దుర్ఘటనలో 16 మంది గాయపడ్డారు. ఎచ్చెర్ల మండలం ఎన్హెచ్-16పై కింతలి మిల్లు జంక్షన్ వద్ద అదుపు తప్పిన వ్యాన్ బోల్తా పడటంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పనులు ముగించుకుని, ఇంటికి వెళ్తున్న హైవే కార్మికులు 16 మంది ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు స్పందించి, 108 అంబులెన్స్లో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕