వరస చోరీలకు పాల్పడుతూ భారీ స్థాయిలో సొత్తును కొల్లగొడుతున్న దుండగులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సుమారు రూ. 91. 38 లక్షల వరుకు వారి నుంచి వసూలు చేసినట్లు తెలిపారు. ఇదివరకు వారు 32 నేరాలు చేశారని, వారిపై ఎచ్చర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదయిందని అన్నారు. ఐదుగురు ముద్దాయిలను అరెస్టు చేసినట్లు తెలిపారు.