వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

రూరల్‌ మండలానికి చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసిన ఘటనలో బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. అతడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. 17 ఏళ్ల బాలికకు చీడిపూడి గ్రామానికి చెందిన సాహుకారి కిృష్ణ అనే వ్యక్తితో పరిచయం, ప్రేమ ఏర్పడింది. ఆ బాలిక తనను పెళ్లి చేసుకోవాలని అడగడంతో సంబంధం లేదంటూ తప్పించుకుంటున్నాడు. బుధవారం శ్రీకాకుళం రూరల్‌ పోలీసులను ఆశ్రయించారు. కిృష్ణపై ఏఎస్‌ఐ నారాయణరావు పోక్సో కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్